సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి

-

నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే విషయంపై నిర్దుష్టమైన సాక్షాదారాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.

అందుకే సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.. ముగ్గురు ఎం.ఎల్.ఏ.లు.పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. పార్టీ కేడర్ అంతా మా వైపే ఉందని.. జిల్లాలో పార్టీ ప్రక్షాళన పై దృష్టి సారిస్తామని చెప్పారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక అటు వచ్చే ఎన్నికల్లో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వై.సి.పి.నుంచి నన్ను సస్పెండ్ చేయడానికి స్వాగతిస్తున్నానని చెప్పారు. కానీ ఎలాంటి షో కాజ్ నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం సరికాదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news