బీజేపీ సీనియర్ లీడర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారనున్నారా.. అంటే అవుననే చెబుతున్నాయి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు. నిన్న సోమువీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో…కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జోరందుకుంది.
కన్నా లక్ష్మీనారాయణ పసుపు కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారంతో ఆగలేదు. ఆయనకు ఏ సీటు ఇస్తారో కూడా తేల్చేశారు. కొంతమంది కన్నాకు సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతలు ఇస్తారని ఫిక్స్ చేశారు. సత్తెనపల్లి టికెట్ అడుగుతున్నారు అనేది వీళ్లంతా చెప్పే మాట.
కన్నా మాత్రం పార్టీ మారతారని ఎక్కడా చెప్పలేదు. అయినా కొంతమంది బిజెపికి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. టిడిపి సంగతి అలా ఉంచితే, ఇటు జనసేన పార్టీలోకి వెళతారని కొందరు చర్చించుకుంటున్నారు. తాజాగా సొంత పార్టీ తీరుపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ తర్వాతే పార్టీ మారతారనే ప్రచారం తెరపైకి వచ్చింది.