చంద్రబాబు అరెస్టు పై మంత్రి కార్మూరి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఏ క్షణంలో అయినా అరెస్టు చేస్తారని వెల్లడించారు మంత్రి కార్మూరి. సుప్రీం కోర్టు స్టేలు అన్నీ ఎత్తేసింది.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో 370 కోట్ల అవినీతి జరిగిందని తేలింది కదా ? అని అగ్రహించారు.
చంద్రబాబు పై బోలెడు కేసులు ఉన్నాయి.. దేనిలో అయినా అరెస్టు అవుతాడు అని పేర్కొన్నారు. అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు దిట్ట అని.. లోకేష్ యువగళంలో యువత లేరు అన్నారు. చంద్రబాబు జీవితం అంతా మోసమేనని.. చంద్రబాబు పై చెప్పులు వేసి ఇప్పుడు శతాబ్ది జయంతి ఉత్సవాలు చేయటానికి సిగ్గు లేదని పేర్కొన్నారు. నా తద్దినం అని విమర్శలు చేసినా బాధ పడలేదు.. కానీ పేదవాళ్ళ ఇళ్ళను సమాధులు కట్టుకోవటానికి అనటం బాధ కలిగిందన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను అవమానించాడని పేర్కొన్నారు.