ఏపీలో ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందన్నారు. లోక్ అదాలత్ లో 57వేల కేసులను పరిష్కరించామని చెప్పారు.
శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీపరంగా మార్పులు చేశామన్నారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2 గా ఉందన్నారు. మహిళలపై అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని తెలిపారు. 88.5% కేసుల్లో చార్జీ షీట్లు వేశామని చెప్పారు. 2021 కంటే 22లో 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయని, 169 పిడి యాక్టు కేసులు నమోదు చేశామని అన్నారు. 2021 లో 284753 కేసులు నమోదు అవగా 2022 లో 231359 కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.