BREAKING : RTC బస్సు నడిపిన కొడాలి నాని… వీడియో వైరల్

-

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూ… అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా కొడాలి నాని ఎదుగుతున్నారు. అయితే తాజాగా కొడాలి నాని.. ఓ కొత్త అవతారంలో అందరికీ దర్శనమిచ్చాడు.

గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని తాజాగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. కొత్తగా ఐదు ఆర్టీసీ అద్దె బస్సులను నిన్న కొడాలి నాని ప్రారంభించారు. అనం తరం గుడివాడ బస్టాండ్ నుంచి సుమారు పది కిలోమీటర్ల పాటు బస్సును స్వయంగా కొడాలి నాని డ్రైవ్ చేశారు. ప్రొఫెషనల్ డ్రైవర్ కు ఏమాత్రం తగ్గకుండా ట్రాఫిక్ లో బస్సు ముందుకు తీసుకువెళ్లారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news