కోడి కత్తి కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసిన నేపథ్యంలో.. తాజాగా సీఎం జగన్ తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టులో తన వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు వినిపించేందుకు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
అయితే తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారనను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే ఈ కేసులో ఎన్ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని కోర్టుకు తెలిపారు వెంకటేశ్వర్లు. రెస్టారెంట్ ఓనర్ డిక్లరేషన్ ఇచ్చారని.. అధికారులు సరైన నిబంధనలు పాటించకుండా ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ ఇచ్చారని, వాటిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయలేదన్నారు. బాధితునిగా సీఎం జగన్ కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుందని వాదనలు వినిపించామన్నారు వెంకటేశ్వర్లు.