అక్రమ మద్యం అమ్మకం ఆరోపణలు.. కొరటాల శివ అసిస్టెంట్ సూసైడ్ అటెంప్ట్ !

పరువు పోయాక జీవించడం వ్యర్థమంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యా యత్నం చేశాడు కొరటాల శివ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు. అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ దర్శకుడు కొరటాల శివ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్స ఏవీ లేకపోవడంతో ప్రస్తుతానికి స్వగ్రామంలోనే ఉంటున్నారు. అయితే నిన్న అతని ఇంటి మీద రాత్రి పోలీసులు దాడి చేశారు.

కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినా అందుకు తగ్గట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే మహేశ్‌ ఇంటికి సమీపంలోని ముళ్లపొదల్లో కొన్ని మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో అతన్ని స్టేషన్‌ కు తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఎవరో గిట్టని వాళ్లు చేసిన ఈ పనికి తన పెళ్లి కూడా ఆగిపోయిందని, గ్రామస్తుల ముందు అవమానంతో బతికేకంటే చనిపోవడమే నయం అంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎదుటే ఆత్మహత్యా యత్నం చేశాడు మహేశ్‌. శరీరంపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంటున్న సమయంలో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.