ఎన్డీయేపై విమర్శలు.. నో డాటా అవైలబుల్.

నో డాటా అవైలబుల్. ఎన్డీయే అన్నదానికి ప్రతిపక్షం ఇస్తున్న తాజా నిర్వచనం. లాక్డౌన్ టైమ్ లో వలస కూలీలు పడ్డ కష్టాలు, రవాణా సౌకర్యాలు లేక కాలినడకన స్వంత ప్రదేశానికి చేరుకోవడానికి పడిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది వలసకూలీలు తమ సొంతగూటికి చేరుకోకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఈ విషయమై ప్రతిపక్షం, చనిపోయిన వారి గురించిన సమాచారం అడగ్గా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విషయమై నిల్ డేటాని సూచించాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. వలస కార్మికులపై డేటా లేదు, రైతుల ఆత్మహత్యలపై డేటా లేదు, కోవిడ్ మరణాల డాటాలో స్పష్టత లేదు, జీడీపీపై సరైన డాటా లేదు, ఆర్థికంగా తప్పుడు సమాచారం.. మొదలగు వాటన్నింటి వల్ల ఎన్డీయే అన్న పదం నో డాటా అవైలబుల్ గా మారిపోయిందని ఒకానొక చిత్రాన్ని షేర్ చేసారు. ఇందులో ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా నో డాటా అవైలబుల్ అన్న బోర్డుని పట్టుకుని కనిపిస్తారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.