రాజకీయాలకు గుడ్ బై చెబుతా – కోటం రెడ్డి సంచలన ప్రకటన

రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. వైసిపి అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్‌ అయ్యారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెబుతోందని ఆగ్రహించారు. ప్రస్తుతం రాష్ట్ర సేవా అధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి ఉన్నాడు.

గిరిధర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తే.. తమ్ముడికి పోటీగా నేను నిలబడను..రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించాడు కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ఫోన్ టాపింగ్ వల్ల నా మనసు కలత చెందిందని..కునుకు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టం..మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి విధేయుడిని అని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి,రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ల వరకు అనుబంధాన్ని కలిగి ఉన్నాను.. రాజకీయాలు నాకేమీ కొత్త కాదు. ఎత్తు పల్లాలు ఎరిగిన వాడినని తెలిపారు. నా శ్వాస.. ధ్యాస రాజకీయమేనని కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పష్టం చేశారు.