16 మందిని పొట్టన పెట్టుకున్న యూట్యూబ్ శానిటైజర్ ట్యుటోరియల్ !

-

అదేంటి యూట్యూబ్ శానిటైజర్ ట్యుటోరియల్ 16 మందిని పొట్టన పెట్టుకుందా ? అంటే అవును అదే జరిగింది. విషయం ఏమిటంటే కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. దీంతో ఈ వ్యవహారం మీద సీరియస్ అయిన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆరోజు నుండి ముమ్మరంగా దర్యాప్తు చేసిన సిట్ ఈ కేసులో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. సిట్ ఇప్పుడు ఏ శానిటైజర్ అయితే తాగి 16 మంది చనిపోయారో ఆ శానిటైజర్ కంపెనీ యజమాని, ముడిసరుకును సరఫరా చేసిన ఇద్దరు మార్వాడీలు, మరో ఇద్దరు డిస్ట్రీబ్యూటర్స్ ను అదుపులోకి తీసుకుంది. అయితే ఈ శానిటైజర్ తయారీ విధానమే కొంప ముంచినట్టు చెబుతున్నారు.

హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివి స్ధానికంగా పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో కిరాణా షాప్ నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు జోరందుకోవడంతో ఆ వ్యాపారంలోకి దిగిన శ్రీనివాస్ వ్యాపారం బాగుండడంతో ఒకరి దగ్గర కొని అమ్మడం కంటే తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందని భావించి యూట్యూబ్‌లో శానిటైజర్ ట్యుటోరియల్ చూసి తయారీ ప్రారంభించాడు. తయారీలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, అనుమతులు లాంటివి ఏమీ తీసుకోకుండా నిభందనలని బేఖాతరు చేస్తూ శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను వినియోగించినట్టు సిట్ గుర్తించింది. మిథైల్‌ క్లోరైడ్‌ వలనే మరణాలు సంభవించి ఉంటాయని సిట్ నిర్ధారణకు వచ్చింది. కురిచేడులోని కొన్ని మెడికల్‌ షాపులకు ఈ శానిటైజర్లు సరఫరా చేసినట్లు ఆధారాలను కూడా సిట్ సేకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news