పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక వస్తుంది – నందమూరి లక్ష్మీ పార్వతి

-

పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక వస్తుందని నందమూరి లక్ష్మీ పార్వతి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్‌ గా పురంధేశ్వరి నియామకం కావడంపై నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు. స్వతంత్రంగా ఎదగ గలననే ఆలోచనలతో పురంధేశ్వరి నియామకం జరిగితే టీడీపీలో చీలిక వస్తుందన్నారు. ఇక ఏపీలో మూడు పార్టీలు కలిసి వెళితే బీజేపీకే నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ ని తిరస్కరించే వాళ్ళు పురంధేశ్వరి వల్ల..బీజేపీకి వచ్చే ఛాన్స్‌ ఉందని తెలిపారు నందమూరి లక్ష్మీ పార్వతి. చంద్రబాబు కంటే ప్రభావవంతంగా పురంధేశ్వరి వ్యవహరిస్తారని నేను అనుకోవడం లేదని కూడా తెలిపారు. బీజేపీ వాళ్ళు దేశ ముదుర్లని పేర్కొన్నారను. బీజేపీ పార్టీతో సాన్నిహిత్యం కోసం పావురాలు, కాకులతో ను చంద్రబాబు సందేశాలు పంపి… చివరకు అమిత్ షా ను కలవగలిగారని చురకలు అంటించారు నందమూరి లక్ష్మీ పార్వతి. బీజేపీ, టీడీపీ కలిస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టేనంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news