వైఎస్‌ భారతిపై ట్రోలింగ్‌.. రంగంలోకి హోంశాఖ..!

-

 

వైఎస్‌ భారతిపై ట్రోలింగ్‌ చేసిన సంఘటనపై ఏపీ హోమ్ మంత్రి తానేటి వనిత స్పందించారు. టిడిపి నేతలే మహిళలపై దాడులు చేసి దొంగే దొంగా అన్నట్లు వుందని.. సీఎం జగన్ మహిళలపై దాడులు నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏపిలో ఇటీవల సోషల్ మీడియాలో మహిళలపై పోస్టింగ్స్ వివాదాలపై స్పందించిన హోం మంత్రీ….సోషల్ మీడియాలో మహిళలను కించ పరిచే పోస్టింగ్ లు పెట్టీ వివాదాలకు కారణం అయ్యింది మొదట టీడీపీనే అని ఆగ్రహించారు.

సోషల్ మీడియాలో ప్రారంభ దశలోనే అరాచకాలకు టిడిపి అద్యం పోసిందని ఫైర్‌ అయ్యారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వివాదం సృష్టించింది టీడీపీనేనని… విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్స్ పెట్టీ పబ్బ్దం గడుపుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ సతీమణి భారతి గారిపై టిడిపి నేతలే పోస్టింగ్స్ పెట్టీ ట్రోల్ చేసారని మండిపడ్డారు.మేము మా పార్టీ నేతలు ఏ రోజు కూడా లోకేష్ బార్యపైన చంద్ర బాబూ భార్యపైన పోస్టింగ్స్ పెట్టామా అని నిలదీశారు. మాకు సభ్యత సంస్కారం ఉందని.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక చట్టం తీసుకొని రాబోతున్నామని ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ మహిళలను వేధిస్తున్న వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news