బ్రేకింగ్ : జేసీ కేసులో మరో అప్ డేట్… బిగుస్తుందిగా!

-

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తుందని తెలుస్తోంది. ఈ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబందించి కీలక ఆధారాలను, కీలక సాక్ష్యాలను సేకరించేపనిలో నిమగ్నమైన పోలీసులు… వాటితో పాటు ఈ కేసులో వీరితోపాటు మరికొందరిని అరెస్టు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు!

ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జలాధర కంపెనీ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఈ సందర్భంగానే కీలకమైన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా… మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటీషన్ ను అనంతపురం తిరస్కరించిన సంగతి తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news