బడ్జెట్ లెక్కలపై జగన్ సర్కార్ కు ఆర్ధికశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ఆర్ధికశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం వివరాలు ఇవ్వాల్సిందిగా కోరిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం… ప్రభుత్వ హామీతో పీఎస్ యూలు, కార్పోరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు.
ప్రభుత్వ హామీతో బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు బహిరంగ మార్కెట్ నుంచి కార్పోరేషన్లు, సొసైటీలు రుణాలు తీసుకున్నాయని పేర్కొంది పీఏజీ కార్యాలయం. రుణం తీసుకున్న సంస్థ పేరు, ఏ ఆర్ధిక సంస్థ నుంచి రుణం పొందారు , అలాగే ప్రభుత్వం హామీకి సంబంధించిన ఉత్తర్వుల వివరాలను సమర్పించాల్సిందిగా కోరిన పీఏజీ… ప్రభుత్వ పథకాల అమలు కోసం బడ్జెట్లో నమోదు కాని ఈ రుణాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరుతూ లేఖ రాసింది. ప్రభుత్వ కంపెనీలు, కార్పోరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే మారుతున్నాయని లేఖలో పేర్కొంది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక ఖాతాలను రూపోందించాల్సి ఉన్నందున మే 31 తేదీలోగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం.