ఏపీలోని జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల సంస్థ. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, సర్వకోట, హీరామండలం, లక్ష్మీనర్సుపేటల్లో పడిగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట పడనున్నాయి. అనకాపల్లి జిల్లాలో దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగులలో పిడుగులు పడనున్నాయన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్.. విజయనగరం జిల్లాలో వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండని చెప్పారు.