కరోనా నెగటివ్ వచ్చిందని చిన్నారిని ఇంటికి పంపగా…

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కలకలం ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా వైరస్ కర్నూలు జిల్లాలో చాలా తీవ్రంగా ఉంది. అక్కడ 300 కేసులకు దగ్గరగా ఉన్నాయి కరోనా కేసులు. తాజాగా అక్కడ కరోనా వైరస్ కి సంబంధించి ఒక కేసు ఆందోళన కలిగిస్తుంది.

కర్నూలు జిల్లాలోని అస్పిరి మండలం జొహరాపురం లో 11 నెలల చిన్నారికి కరోనా అనుమానం తో పరిక్షలు చేసారు. అయితే కరోనా పరీక్షల్లో ఆ చిన్నారికి నెగటివ్ వచ్చింది. దీనితో చిన్నారిని ఇంటికి పంపించారు. కాని మళ్ళీ పాజిటివ్ వచ్చిందని ఫోన్ చేసారు అధికారులు.

చిన్నారిని ఆస్పత్రికి తీసుకుని రావాలని ఫోన్ చేయగా తాము ఆస్పత్రికి తీసుకుని వచ్చేది లేదని తల్లి తండ్రులు స్పష్టం చేసారు. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే వినడం లేదు. ఎన్ని విధాలుగా చెప్పినా సరే తీసుకుని వెళ్ళడం లేదు. దీనితో వారితో మాట్లాడటానికి మంత్రి రంగంలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news