తన రేంజ్ ఏమిటో చెప్పిన లోకేష్… తమ్ముళ్ల ఆవేదన – రైతుల ఆందోళన!

-

యువకుడు, ఉత్సాహవంతుడు, టీడీపీ ఆశాకిరణం, టీడీపీ నుంచి భవిష్యత్ ముఖ్యమంత్రి క్యాండిడేట్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు అయిన నారా లోకేష్ విషయంలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దానికి కారణం.. పోరాడాల్సిన వయసులో, ఎదురు నిలబడాల్సిన సమయంలో, తమ్ముళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో… చినబాబు జగన్ కు శాపనార్థాలు పెడుతూ సరిపెడుతుండటం.

పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం… చినబాబుపై తమ్ముళ్లు, రాజధాని రైతుల ఫోకస్ పెరిగింది. కరోనా భయం విపరీతంగా కలిగి ఉన్న చంద్రబాబు నుంచి పెద్దగా రియాక్షన్ ఆశించని తమ్ముళ్లు… ఆశలన్నీ లోకేష్ పై పెట్టుకున్నారు. ఈ విషయంలో జగన్ కంటే వయసులో చిన్నవాడైన లోకేష్.. అంతకు మించిన పోరాట పటిమ కనబరుస్తారని ఆశించారు. రాజధాని రైతుల విషయంలో బాబు ఆన్ లైన్ లో ఆవేదన పడటానికే పరిమితమైన వేల… చినబాబు రంగంలోకి దిగుతారని నమ్మారు. తనను తాను నిరూపించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే క్రమంలో… రైతుల తరుపున ప్రభుత్వంపై పోరాడతారని భావించారు. కానీ.. లోకేష్ చేస్తున్నదేమిటి?

తాజాగా ఏపీలో ట్విట్టర్ రాజకీయాలకు ఆధ్యుడిగా పేరు సంపాదించుకున్న లోకేష్… తాజాగా మరోమారు ట్వీట్టర్ వేదికగా తన ఆవేశాన్ని చూపించారు. మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి.. 79 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు! తుగ్లక్ నిర్ణయాలతో బ‌ల‌వుతున్న రైతుల ఉసురు జ‌గ‌న్‌ రెడ్డికి త‌గ‌ల‌క‌మాన‌దని శాపనార్థాలు పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… లోకేష్ లాంటి యువనేత చేయాల్సింది ఇది కాదు కదా అనేది తమ్ముళ్ల ప్రశ్న కం ఆవేదన!

ఆ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించిన వెంటనే… లోకేష్ అమరావతిలో వాలిపోతారని.. రైతుల దగ్గరకు చేరిపోతారని.. వారికి ధైర్యం కలిగించేలా వారిమధ్య నిలుస్తారని.. ప్రభుత్వం ఈ విషయంలో దిగొచ్చేలా ఉద్యమాన్ని తీసుకొస్తారని.. విశాఖకు పరిపాలనా రాజాధానిని ఆపలేకపోయినా, కనీసం రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా కదిలొస్తారని.. అంతా భావించారు! దీంతో… వారందరి ఆశలకు, వారందరి నమ్మకాలకు, వారందరి ధైర్యానికి చినబాబు తూట్లు పొడిచారు.. ఈ సమయంలో కూడా తన ఫ్లాట్ ఫాం ట్విట్టర్ అని, తన శక్తి శాపనార్థాలకు, విమర్శలకు పరిమితమని చెప్పకనే చెప్పినట్లయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news