చిరంజీవి అన్నదాంట్లో తప్పేముందని నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సత్తెనపల్లిలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మంత్రి అంబటిపై విమర్శలు గుప్పించారు. ‘అంబటి డాన్సులు వేసింది… సుకన్యతో మాట్లాడింది నిజమేగా. మాపై సెటైర్లు వేస్తూ సినిమాలు తీసినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు.
పోలవరం అభివృద్ధి కుంటుపడింది. చిరంజీవిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిత్ర పరిశ్రమను వదిలి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టండి అన్న చిరంజీవి వాక్యాల్లో తప్పేముంది’ అని లోకేష్ ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా, సినిమా పరిధిని పెంచడానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరిశ్రమ ఉందంటే కారణం ఖర్చు పెట్టడమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ ఖర్చుకు తగ్గట్టుగా ఎంతో కొంత ఆదాయం రావాలని కోరుకోవడం సమంజసమని తెలిపారు. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి కానీ… అణగదొక్కాలని చూడకూడదు అంటూ చిరంజీవి ప్రభుత్వాల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.