14,954 మంది వీఆర్‌ఏలను సర్దుబాటు చేసిన సర్కారు

-

వీఆర్​ఏలను క్రమబద్దీకరించడంతోపాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసింది. 14వేల 954 మంది వీఆర్​ఏలను.. సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, మిషన్ భగీరథ శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులకు అనుమతించింది. రెవెన్యూ శాఖ పోస్టులను జిల్లాలు, క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా విభజించారు. విద్యార్హతలు, అనుభవం, నియామక ప్రాతిపదికగా కేటాయింపు జరిగినట్లు చెబుతున్నారు. విద్యార్హతలు ఉండి పదేళ్ల పైబడి అనుభవం ఉన్న వారందరినీ వార్డు ఆఫీసర్లుగా నియమించినట్లు సమాచారం. అందరికీ మంత్రుల చేతుల మీదుగా నేటి నుంచి నియామక ఉత్తర్వులు అందిస్తారు.

రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకు 16, డివిజన్ కు 7, మండలానికి 5 కేటాయించారు. రెవెన్యూ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకు 3, డివిజన్ కు 4, మండలానికి 3 కేటాయించారు. రెవెన్యూ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు జిల్లాకు 12, డివిజన్ కు 4, మండలానికి 3 ఇచ్చారు. రెవెన్యూ చైన్ మ్యాన్ పోస్టులను డివిజన్, మండలానికి ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ప్రతి గ్రామీణ మండలానికి ఆరు చొప్పున… మిషన్ భగీరథ హెల్పర్ పోస్టులను కేటాయించారు. ఇదే తరహాలో పురపాలక శాఖ వార్డు ఆఫీసర్, నీటిపారుదల శాఖలో లష్కర్, హెల్పర్ పోస్టులను ఖరారు చేసి వీఆర్​ఏలను కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news