ఆదివారం అనంతపురానికి పులి వస్తుంది!

-

ప్రస్తుతం ఏపీ టీడీపీ పరిస్థితి ఏమీ బాగున్నట్లుగా లేదు! ఒకపక్క గెలిచిన వారు సైకిల్ దిగిపోతుంటే… ఓడిన సీనియర్లు ఫ్యాన్ కిందకు చేరిపోతున్నారు. దానికి తోడు మొన్న సీబీఐ కేసులు, నిన్న అచ్చెన్న అరెస్టు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి విత్ హిస్ సన్ అరెస్టు! ఆఖరికి హాస్పటల్ లో ఉన్న తమ నేత అచ్చెన్నాయుడిని కూడా కలుసుకోలేని పరిస్థితి చంద్రబాబు & లోకేష్ కు దాపురించింది.. పరిస్థితులు అలా వచ్చాయి మరి! కరోనా కదా!! ఈ సమయంలో టీడీపీ యువనేత, తెలుగు తమ్ముళ్ల ఆశాకిరణం, టీడీపీ ఆశాజ్యోతి అయిన నారా లోకేష్ అనంతపురానికి వెళ్లనున్నారు!

అవును… కరోనాతో రాష్ట్రం అల్లల్లాడిపోతుంటే, ఏపీలో అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కేంద్రాని అనుమతి అడిగి అభాసుపాలయ్యారే తప్ప సొంత రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే పనికి పూనుకోలేకపోయారు చంద్రబాబు & లోకేష్! కరోనా పేరుచెప్పి హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నారే తప్ప విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో అంతమంది చనిపోతే.. వారిని పరామర్శించడానికి నాడు పోలేదు.. ఇప్పటివరకూ వెళ్లలేదు. కాకపోతే… జగన్ సర్కార్ కోటి రూపాయల నష్టపరిహారాన్ని వెక్కిరించి.. మహానాడు వేదికగా రూ.50వేలు ప్రకటించారనుకోండి అది వేరే విషయం!

కానీ… అవినీతి కేసులో అరెస్టయిన తమ పార్టీ నేతను కలుసుకోవడానికి మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు చంద్రబాబు & లోకేష్! అధికారులు అనుమతి ఇవ్వలేదనుకోండి… అది కూడా వేరే విషయం! కరోనా కదా!! ఇదే క్రమంలో అనంతపురం జిల్లాలో రవాణా అధికారి (డీటీసీ) 24 క్రిమినల్‌ కేసులు నమోదు చేయగా.. కర్నూలు డీటీసీ మరో 3 క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన జేసీ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి ని పరామర్శించడానికి వెళ్తానని అంటున్నారు నారా లోకేష్!

ఈ విషయంలో ట్రాన్స్ పోర్ట్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్న చినబాబు… ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లి.. బెంగళూరు నుంచి అనంతపురానికి వెళ్లనున్నారు. అనంతరం అనంతపురంలో జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించనున్నారు. గతకొన్ని రోజులుగా పార్టీలో దూకుడు పెంచిన చాలా కాలం తర్వాత సీమకు వెళ్తుండటంతో… ఆదివారం అనంతపురానికి పులొస్తోంది అంటున్నారు రాయలసీమ టీడీపీ కార్యకర్తలు!!

Read more RELATED
Recommended to you

Latest news