దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రస్తుతం భారీగా నమోదవుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మరణాల రేటు 3 శాతం లోపే ఉంది. అయితే నిత్యం తెలంగాణలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే మరో 6 వైరస్ నిర్దాణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 5వేల వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 25 వేల వరకు పడకలను సిద్ధం చేశామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న కరోనా చికిత్సా కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి…
* గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్ నోడల్ కేంద్రంగా సేవలు అందిస్తున్నారు. ఇక్కడ 2వేల పడకల సామర్థ్యం ఉంది.
* కింగ్ కోఠి, హైదరాబాద్ జిల్లా హాస్పిటల్
* కొండాపూర్, రంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో 20 పడకల సామర్థ్యం ఉంది.
* ఎర్రగడ చెస్ట్ హాస్పిటల్
* పంజగుట్ట నిమ్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కరోనా పరీక్ష నిర్దారణ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
* గాంధీ మెడికల్ కాలేజీ
* ఉస్మానియా మెడికల్ కాలేజీ
* పంజగుట్ట నిమ్స్
* సీసీఎంబీ
* నల్లకుంట ఫీవర్ హాస్పిటల్