ఆన్లైన్ రమ్మీ.. రైలు కింద తల పెట్టాడు…!

ఆన్లైన్ రమ్మీ దెబ్బకు ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్ లో చాలా వరకు పోగొట్టుకుని చాలా మంది అప్పుల పాలు అవుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆన్లైన్ లో రమ్మీ కి యువకుడు బలి అయ్యాడు. గోపాల పట్నం కొత్తపాలానికి చెందిన మద్దాల సతీష్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ లో రమ్మీ ఆటలో రూ. 25 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.

దీనితో అప్పులపాలై మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ప్రస్తుతం నావెల్ డాక్యుర్డులో ఉద్యోగం చేస్తున్నాడు. 3 రోజులుగా సతీష్ కనిపించక పోవడంతో గోపాలపట్నం పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. విచారణ చేయగా మేఘాద్రి గెడ్డ సమీపంలో రైలు క్రింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అని గుర్తించారు. మృతుడు సతీష్ కు భార్య, ఒక పాప అని పోలీసులు వెల్లడించారు.