టీడీపీలోకి మంచు మనోజ్..ఆ వైసీపీ ఎమ్మెల్యేపైనే పోటీ.. !

-

మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రెండో వివాహానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి కూతురు అయిన భూమా మౌనిక రెడ్డిని త్వరలో వివాహ మాడనున్నాడు మంచు మనోజ్. ఇందులో భాగంగానే తాను త్వరలో వివాహమాడబోయే మౌనిక రెడ్డి తో కలసి వినాయకుడిని ఇటీవల దర్శించుకున్నాడు మనోజ్.

అయితే… వీరి జంటపై గోనె ప్రకాష్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. మంచు మనోజ్‌ ఫ్యూచర్‌ ప్లానింగ్స్‌ గురించి కూడా చెప్పారు. త్వరలోనే మంచు మనోజ్‌ టీడీపీ పార్టీలో చేరబోతున్నారని… పేర్కొన్నారు. మోహన్‌ బాబు గారికి రాజకీయాల్లో ఆసక్తి ఉందని.. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో.. జగన్‌ రాజ్యసభ ఇస్తారని ఆశించారని తెలిపారు గోనె.

కానీ ఆయన అలా చేయలేదని.. కానీ ఇప్పుడు మంచు మనోజ్‌.. ఓపెన్‌ గా కమ్‌ ఔట్‌ అవుతున్నారన్నారు. మోహన్‌ బాబు గారి ఏజ్‌ అయిపోయిందని.. ఇప్పుఉడ మనోజ్‌ పాలిటిక్స్‌ లోకి రావొచ్చన్నారు. అంతేకాదు.. చంద్రగిరి నియోజక వర్గం నుంచి మనోజ్‌ పోటీ చేస్తారన్నారు గోనె ప్రకాష్‌. అక్కడ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news