సొంత గూటికి చేరనున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి..?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ వైసీపీ చేపట్టిన ఇన్చార్జిల మార్పుల్లో టికెట్ కోల్పోయిన సీనియర్ ఎమ్మెల్యే తాళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత పార్టీలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఆయన వైసీపీ చేపట్టిన ఇంచార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. దీంతో అధికార వైసిపికి గుడ్ బాయ్ చెప్పి ఏపీసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల హయాంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు ప్రారంభమయ్యాయి.

మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గరనుంచి అన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పై ఒత్తిడి పెంచారు గత రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో చర్చించారు. న్ ఈ చర్చల్లో తిరిగి వైసిపి లోకి వచ్చేందుకు వాళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇవాళ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తో కలిసి సీఎం జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాల్వనున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్కే స్థానంలో వైసిపి ఎంపిక చేసిన బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇన్చార్జిని కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో ఆర్కే కూడా వయసులోకి తిరిగి వస్తే జగన్ రిస్కు ఎందుకని తిరిగి ఆయన టికెట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదని వైసీపీలో పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news