పల్నాడు హత్య కేసుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. రెడ్ బుట్ రాజ్యాంగం రాష్ట్రాల్లో అమలు అవుతుంది… ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. వినుకొండలో ఒక యువకుడ్ని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమిదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు ఏమిటి ? నడిరోడ్డుపై టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి ముస్లిం మైనారిటీ యువకుడి పై దాడి చేసి చంపేశారని ఆగ్రహించారు.
అసలు విశాఖలో జైలుకెళ్ళిన ప్రేమోన్మాది బయటికి వచ్చి బాధితురాలు తల్లిపై దాడి చేశాడని.. జరుగుతున్న సంఘటనలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహించారు. నారా లోకేష్ నేరుగా చెబుతున్నాడన్నారు. గడిచిన 40 రోజుల్లో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎందుకు శ్వేత పత్రం రిలీజ్ చేయటం లేదని ప్రశ్నించారు. జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.