చంద్రబాబుకు మేరుగ సవాల్..ఓడిపోతే వైఎస్సాఆర్ సమాధి దగ్గరే ఉండిపోతా

-

 

చంద్రబాబు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారని..లేకపోతే తరిమేస్తారని ఫైర్‌ అయ్యారు మంత్రి మేరుగ నాగార్జున. ఎస్సీలకు ఎవరేం చేశారో చర్చకు రమ్మని చంద్రబాబు సవాల్ చేశారు… ఆ సవాల్ కి నేను సిద్దమేనన్నారు. నేను ఒక్కడినే వస్తా..ప్లేస్ చెప్పు.. నీ హయాంలో దళితుల మీద దాడులు, ఆస్తులు కబ్జా దగ్గర నుండి అన్నిటి పై చర్చిద్దామని ఛాలెంజ్‌ చేశారు మంత్రి మేరుగ నాగార్జున.

అసలు దళితులకు నువ్వు ఏం చేశావయ్యా చంద్రబాబూ?జగన్ మా పల్లెల్లో మార్పులు తెచ్చారన్నారు. స్కూల్స్ మార్చారు, పిల్లలకు ఇంగ్లీషు మీడియం నేర్పారు.. ట్యాబ్‌లలో చూసి చదువుకునే స్థాయికి తెచ్చారు..ఆరోగ్యశ్రీతో ఆరోగ్య భద్రత తెచ్చారని కొనియాడారు.

వీటిల్లో దీనిపై నైనా చర్చకు సిద్ధమేనని.. నేను మీ మీద ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సమాధి దగ్గరే ఉండిపోతానని సంచలన ప్రకటన చేశారు మంత్రి మేరుగ నాగార్జున. మరి మీరు చర్చకు రాగలరా చంద్రబాబూ? దళితులకు రాజకీయాలు ఎందుకని మీ నాయకుడు చింతమనేని అన్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news