సుప్రీంకోర్టు ఆదేశాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ను సిబిఐ ఎక్కడా కూడా తప్పు పట్టలేదు.. ఇంకా విస్తృతమైన విధానంలో పరీక్షలు చేయించమని మాత్రమే సూచించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వ్యక్తులు ఇవాళ మరింత మోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు… తప్పు పట్టిందే గత టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని.
వై వి సుబ్బారెడ్డి హయంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు తక్కువ స్థాయికి దిగజారాయి. విజిలెన్స్ ఎంక్వయిరీ ని నిలుపుదల చేయండి.. విజిలెన్స్ ఎంక్వయిరీ జరగకూడదని కోర్టుకు వెళ్ళిన వ్యక్తే గతంలో టిటిడి చైర్మన్ గా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి. ఆయన తప్పు చేయకుండా ఉంటే విజిలెన్స్ ఎంక్వయిరీ ని ఎందుకు ఆపాలని కోరారో ఆయనకే తెలియాలి. టెండర్ల ప్రక్రియలో అనేక అక్రమాలకు పాల్పడింది గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే అని మంత్రి ఆనం పేర్కొన్నారు.