పంటల బీమా విషయంపై మాజీ సీఎంపై అచ్చెన్నాయుడు ఫైర్..!

-

పంటల బీమా విషయంపై మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఐదేళ్ల నీ అరాచక పాలనలో పంటల బీమాను అస్తవ్యస్తం చేశావు. రబీలో సాగు చేసిన రైతులను అసలు రైతులుగానే పరిగణించని నువ్వు బీమా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని మంత్రి అన్నారు. అలాగే ఐదేళ్ల పాటు రబీలో సాగు చేసిన ఒక్క రైతుకూ బీమా అమలు చేయని నీ అసమర్థ ప్రభుత్వంలో రైతులు ఎంతో తీవ్రంగా నష్టపోయారు.

గత ఐదేళ్ల పాటు రబీ సీజన్లో బీమా పథకాన్ని అమలు చేయక పోగా రైతులు సొంతంగా బీమా చెల్లించే సౌలభ్యం కూడా లేకుండా చేశారు. ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో రైతులకు ఉద్యాన రాయితీలు లేవు.. సూక్ష్మ సేద్యం లేదు, సకాలంలో ఎరువులు అందలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయకత్వంలో.. NDA ప్రభుత్వంలో తిరిగి రైతులకు అన్ని రాయితీలు అందుతున్నాయి అని వ్యవసాయ శాఖా మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version