ఏపీ రైతులకు మరో శుభవార్త.. వాటి ధరలపై కీలక ప్రకటన

ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఆయిల్‌ పామ్‌ ధరలపై ధరలపై కీలక ప్రకటన చేసింది ఏపీ వ్యవసాయ శాఖ. ఆయుల్ పామ్ ధరలపై మంత్రి కాకాని గోవర్ధన్‌ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులతో కాకాని సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ.. త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయస్తామని ప్రకటన చేశారు. సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామన్నారు. ఓఇఆర్(ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అడాప్ట్ చేస్తామని చెప్పారు. అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని ప్రకటన చేశారు.

ఆయిల్ ఫామ్ ధరల నిర్ణయంలో రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశాలిచ్చామన్నారు.