అధికార కాంగ్రెస్ పై బిగ్ పైట్ కు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.. పక్కా ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నాయి.. నవంబర్ నుంచి కాషాయం పార్టీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతుంటే.. డిసెంబర్ నుంచి మేం కూడా రోడ్లమీదకే వస్తామని బిఆర్ఎస్ చెబుతోంది.. గుంపులుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా.. తగ్గేదేలా అని కాంగ్రెస్ చెబుతోంది.. ఇంతకీ ఇయర్ ఎండింగ్ లో తెలంగాణలో ఏం జరగబోతుంది..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తోంది. ఉచిత బస్సు, రుణమాపీలు మినహా.. మిగిలిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.. దీంతో బిజేపీతో పాటు.. బీఆర్ఎస్ పార్టీలు ఉద్యమాలకు సిద్దమవుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నుంచి ప్రజాసమస్యలపై ఉద్యమిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చేశారు.. గ్యారేంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఒక్క ఇళ్లు కట్టలేదు. పేదలకు ఒక్క ఇళ్లు పంచలేదని బిజేపీ నేతలు మండిపడుతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేసి ప్రజల్లో మైలేజ్ పొందేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది..
డిసెంబర్ తో బీఆర్ఎస్ కూడా రోడ్డెక్కబోతుందన్న ప్రచారం జరుగుతోంది.. ఈ ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది..? ఎన్ని హామీలను అమలు చేసింది..? అనే కోణంలో ఆ పార్టీ పైట్ కు సిద్దమవుతోంది.. కేసీయార్ కూడా ఈ పోరాటాలకు హాజరుకాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.. కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రావట్లేదని రాజకీయాల్లో జరుగుతున్న చర్చలకు డిసెంబర్లో ఆయన పుల్ స్టాప్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.. ఈ పార్టీలతో పాటు సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా అడపాదడపా పోరాటాలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి.. అయితే ఇయర్ ఎండింగ్ కు మాత్రం పొలిటికల్ పైట్ పీక్స్ కువెళ్లే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది..
ఈ పార్టీల పోరాటాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా సిద్దమవుతోంది..కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని బిజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.. కేసీయార్ జనాల్లోకి రాకపోవడాన్ని కూడా కాంగ్రెస్ హైలెట్ చెయ్యబోతుందట.. మొత్తంగా.. ఇయర్ ఎండింగ్ కల్లా.. తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి..