ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. శాసన మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఐదేళ్లలో జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేశారని.. రైతుకు కన్నీళ్లు మిగిల్చారని ఆగ్రహించారు. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
రైతులకు ఉన్న బకాయిలో వెయ్యి కోట్లు మేం చెల్లించామన్నారు. 674 కోట్లు బకాయి ఉందని… 10 నుంచి 15 రోజుల్లో రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. తొలి ప్రాధాన్యత గా రైతులకు చెల్లింపులు జరుపుతామని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై 39 వేల కోట్లు అప్పు చేసిందని ఆగ్రహించారు. రైతులకు మాత్రం 1650 కోట్లు బకాయి చెల్లించ కుండా వెళ్ళిపోవటం దురదృష్టకరమని ఆగ్రహించారు మంత్రి నాదెండ్ల మనోహర్.