గత 200 సంవత్సరాల్లో ఇంత వర్షం, వరద ఎప్పుడు రాలేదు : మంత్రి నారాయణ

-

గత 200 సంవత్సరాల్లో ఇంతలా వర్షం, వరద ఎప్పుడు రాలేదు అని మంత్రి నారాయణ అన్నారు. అయితే అంతా సమన్వయంతో చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేశాం. పడవలు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడిపోయాయి.. ప్రస్తుతం ఫీల్డులో 30 డ్రోన్లు పని చేస్తున్నాయి. రాత్రికి 10 లక్షలు పాకెట్లు ఆహారం అందిస్తాం. వాటర్ సప్లై కూడా పంపించాం.. ఎక్కువ మంది మిల్క్ అడుగుతున్నారు.

ఈ రోజు ఈవెనింగ్ సీఎం ఆదేశం మేరకు 10 లక్షల పాకెట్ల పాలు ఇస్తున్నాం. వరద నీరు తగ్గాక శానిటేషన్ పైన దృష్టి పెడుతున్నాం. నీరు వెళ్ళాక బురదను ఫైర్ డిపార్ట్మెంట్ వాహానాలతో తొలగిస్తాం. 3000 మంది ఈ కార్పొరేషన్ లో ఉన్నారు. వారికి తోడు 10 వేల మందిని వివిధ కార్పొరేషన్ల నుంచి ఇక్కడకు తెచ్చాం. వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ చేస్తున్నాం అని మంత్రి నారాయణ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news