ఏపీలో 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు : మంత్రి సత్యకుమార్

-

70% మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి క్యాన్సర్ అవగాహన చాలా అవసరం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ ల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలని ఏపీ సీఎం త్వరలో ప్రారంభిస్తారు. 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు చేస్తాం. 18 వేల మందికి కేన్సర్ టెస్టులు చేయడంలో పరిజ్ఞానం కల్పించాం. ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ అవగాహన కల్పించడం జరుగుతుంది.

హోమీబాబా కేన్సర్ సెంటర్ వారి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. 17 భోదన ఆసుపత్రులకు కేసులు రిఫర్ చేస్తాం. సెలబ్రిటీలను కూడా క్యాన్సర్ అవగాహనలో భాగస్వామ్యం కావాలని కోరాం. 125 మంది స్పెషలిస్ట్ లను ఏర్పాటు చేసాం. స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గ్రీన్ ఛానెల్ ద్వారా ఇప్పిస్తాం. గత డయేరియా బారిన పడిన వారు 10.5 లక్షల మంది. 4 నెలల్లో అద్భుతాలు చేయలేరు.. ఎవరూ ఏదీ చెడగొట్టలేరు. డయేరియాకు కారణం కలుషిత నీరు కారణం… డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా కారణమే అని మంత్రి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version