చంద్రబాబు, లోకేష్ డీఎన్‌ఏ లోనే ఏదో తేడా ఉంది – వైసీపీ ఎమ్మెల్సీ

-

చంద్రబాబు, లోకేష్ డీఎన్‌ఏ లోనే ఏదో తేడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీ లో చర్చిద్దామని.. మా‌ సవాల్ ని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

దీని పై రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించ టానికి మేము రెడీ అంటూ సవాల్‌ విసిరారు మొండితోక అరుణ్ కుమార్. 2 లక్షల కోట్లు పేదల ఖాతా లో వేస్తే అందులో అధికభాగం లబ్ది పొందింది దళితులేనని.. 28 పథకాలు తీసేశామని చంద్రబాబు చెప్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఆ పథకాలు, వాటి ద్వారా లబ్ది పొందిన వారి లిస్టు బయట పెట్టాలని.. చంద్ర బాబు, లోకేష్ డీఎన్‌ఏ లోనే ఏదో తేడా ఉందని వివాదానికి తెరలేపారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఎంతమంది దళితులకు చంద్రబాబు హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారో చెప్పాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news