RC16 పై క్లారిటీ వచ్చినట్టేనా..?

-

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన.. తన తదుపరి చిత్రాన్ని ఉప్పెనా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నారు . ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.. కానీ RC 16 అని పిలుస్తున్నారు. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో రకాల రూమర్లు తెరపైకి వస్తున్నాయి.

స్పోర్ట్స్ డ్రామా అనగానే ఒక క్రీడాకారుడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా వస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ కి చిత్ర బృందం తాజాగా చెక్ పెట్టింది.. ఒక క్రీడా ఆధారంగా సాగుతుందని కాకపోతే బయోపిక్ కాదు అని క్లారిటీ ఇచ్చారు.. ఒకరకంగా చెప్పాలి అంటే ఆటలను ఆధారంగా చేసుకుని సాగే ఒక కల్పిత కథ మాత్రమేనని చిత్ర బృందం తెలిపింది. ఇక బుచ్చిబాబు కథ తన కల్పనల ఆధారంగా సృష్టించినదే అని ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్ కి సంబంధించింది కాదు అంటూ చెప్పుకొచ్చారు.

బుచ్చిబాబు కథను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే మరొకవైపు రాంచరణ్ కూడా తన 15వ సినిమా గేమ్ చేజర్ ని పూర్తి చేసుకునే పనిలో బిజీ కానున్నాడు . ఇక ఈ సినిమా షూటింగు సెప్టెంబర్లో మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతము రామ్ చరణ్ భార్య ఉపాసన డెలివరీ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నారు . ఈ నేపథ్యంలోనే కొన్ని నెలలు భార్యతో అలాగే పుట్టబోయే బిడ్డతో సమయం గడిపిన తర్వాత మళ్లీ ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇక బుచ్చిబాబు సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news