అసలు కొడాలి నానికి.. వంశీకి మగతనం ఉందా..? – టీడీపీ ఎమ్మెల్సీ

-

అసలు కొడాలి నానికి.. వంశీకి మగతనం ఉందా..? అని సంచలన వ్యాక్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. మేం మొదట్నుంచి ఈ ప్రభుత్వం.. సీఎం ఫేక్ అని చెబుతూనే ఉన్నామని.. లోకేష్ జూమ్ పెడితే ఫేక్ ఐడీలతో జొరబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్‌ బాబు.

కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రొగ్రెస్ రిపోర్ట్ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దగ్గర బాగోలేదని.. సీఎం దగ్గర మార్కులు వేయించుకోవాలని జూమ్ లో జొరబడ్డారని చురకలు అంటించారు.

జూమ్ లోకి జొరబడడం ద్వారా సీఎం దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. ప్రజలు ఉమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. కొడాలి నానికి.. వంశీకి మగతనం ఉందా..? నాని, వంశీలకు మగతనం ఉంటే వాళ్ల నియోజకవర్గాల్లో పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులు, పేరెంట్సుతో సమావేశం పెట్టాలని డిమాండ్‌ చేశారు. వాళ్ల నియెజకవర్గాల్లోని విద్యార్ధులను.. తల్లిదండ్రులు సమాధాన పర్చండన్నారు. విద్యార్థులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాటం ఆగబోదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news