SBI శుభవార్త: ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెరుగుదల.. ఎంతంటే..?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్‌ డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ బుధవారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచేందుకు బ్యాంకు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా అధికారికంగా తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.10 శాతం చొప్పున వడ్డీ లభిస్తోందన్నారు. 5 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 5.45 శాతం వడ్డీ రేట్లు అమలులో ఉందన్నారు. రెపో రేటుకు అనుణంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని దినేష్ కుమార్ తెలిపారు. కాగా, ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు అధికమవుతున్నాయి. దీంతో వినియోగదారులపై ఈఎంఐల భారం పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news