స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లే సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌న్యూస్ తెలిపింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు గంటల కొద్ది నిరీక్షించకుండా.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు టీటీడీ గురువారం వెల్లడించారు. గంటన్నరలోపై సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్, వివిధ సేవల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి అవకాశం ఉందన్నారు.
రెండు నెలల క్రితం నుంచి శ్రీవారి దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారిని క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి తెలిపారు. అలాగే తిరుపతిలోని విష్ణు విలాసం, శ్రీనివాసం, శ్రీ భూదేవి కాంప్లెక్స్ ప్రాంతాల్లో టైమ్‌స్లాట్ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే తిరుమలలో 7,500 గదులకు ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని అన్నారు. వీటిలో 4,500 గదులకు మరమ్మతులు పూర్తికాగా.. మరో 750 గదులకు పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే, రెండున్నర ఏళ్లలో రూ.1,500 కోట్లు విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.