ఏలూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ..

-

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా..మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.యూనిట్ 4 లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలి పోవడం అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు భావిస్తున్నారు.

” ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్లో ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగడం బాధించింది.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.కాగా కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్య కోరల్లో గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news