బాబుకి కరోనా దూరంగా ఉండడానికి కారణం ఇదా ? శభాష్ రెడ్డి గారు ! 

-

టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 70 ఏళ్లకు పైబడి ఉంది. అసలు ఈ వయసు వారు ఎవరూ జనాల్లో తిరిగేందుకు అంత శ్రేయస్కరం కాదు. కరోనా విజృంభిస్తున్న సమయంలో చంద్రబాబు సైతం దీనిని పాటించాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడప్పుడు మాత్రమే ఏపీలో పర్యటించారు. పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అయితే ఎక్కువగా హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించారు  పార్టీ కార్యక్రమాలు అయినా, ప్రభుత్వంపై విమర్శలు అయినా, మీడియా సమావేశాలు అయినా, ఏదైనా జూమ్ ద్వారానే నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ లో ఎన్నో సంచలన పరిణామాలు జరిగినా, బాబు ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు.
ఆయనతో పాటు, ఆయన కుమారుడు లోకేష్ సైతం హైదరాబాదులోని తమ నివాసంలోనే ఎక్కువ గా గడుపుతూ వస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా, వెనక్కి తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలిసో  తెలియకుండా నో కరోనా సోకినట్టు ఆరోగ్య నిపుణులు సైతం తేల్చేశారు  అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కరోనా రాకపోవడానికి గల కారణాలు ఏంటో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడూ చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఇప్పుడు కరోనా విషయంపైన చంద్రబాబు విమర్శలు చేశారు.
కరోనా వైరస్ ఉన్న సమయంలో చంద్రబాబు ఏపీలో ఉండకుండా, ఇదే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… సోషల్ మీడియా ద్వారా స్పందించడం పై అప్పట్లో వైసిపి గట్టిగానే చంద్రబాబుపై విమర్శలు చేసింది ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని గుర్తు చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు.
” కరోనాను బాబు ఎలా ఎదుర్కోగలిగాడు ?
1. ఎనిమిది నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా…
2. తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడు అని కరోనా భయపడడం వల్ల …
3. కరోనాయే ఛీ కొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల
4. లోకేష్ అనే మహావీరుడి వల్ల !!! ” 
అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news