సీఎం జగన్ కు చంద్రబాబు మరో సెల్ఫీ సవాల్

సీఎం జగన్ కు చంద్రబాబు మరో సెల్ఫీ సవాల్ విసిరారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు చంద్రబాబు నాయుడు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? అని ఆగ్రహించారు చంద్రబాబు.

18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా? అని ఫైర్‌ అయ్యారు. పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది? అని తెలిపారు. 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు….మీరు, మీ ప్రభుత్వం అంటూ ఆగ్రహించారు చంద్రబాబు.