ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ  ముఖ్య నేత కొణిదల నాగబాబు నామినేషన్
దాఖలు చేశారు. శుక్రవారం మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందచేశారు. అంతకుముందు నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాస్,
విష్ణుకుమార్ రాజులు బలపరిచారు.

మరోవైపు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును డిప్యూటీ సీఎం పవన్ ఖరారు చేసిన
సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news