స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా – లోకేష్

-

టీడీపీ పార్టీ కీలక నేత నారా లోకేష్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశానంటూ లోకేష్‌ పేర్కొన్నారు. నిన్న హలో లోకేశ్ కార్యక్రమంలో నారా లోకేష్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని నారా లోకేష్‌ ను అడగింది.

అయితే… ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు నారా లోకేష్‌ అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చారు. తనకు కూడా చాలా మంది క్రష్‌లు ఉండేవని… కానీ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ అనవసరంగా ట్రోల్ చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. నాది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ అంటూ నారా లోకేశ్ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news