ఆదివారం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుమారు 30 వేల మందికి జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన అనంతరం కానుకలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
దీంతో ఘటన స్థలంలోనే ఓ మహిళ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ ఆరోపణలపై స్పందించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా అయన స్పందిస్తూ.. ” రిలయన్స్ వాళ్లు తన తండ్రిని చంపేశారంటూ నాడు ప్రజలను రెచ్చగొట్టి రిలయన్స్ అవుట్ లెట్స్ కి నిప్పంటించాడు, నేడు వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన మేకవన్నె పులి జగన్ రెడ్డి.
ఓట్ల కోసం సొంత బాబాయ్ పై గొడ్డలి వేటేసిన క్రూరుడు జనాన్ని కనికరించి వదిలేస్తాడు అనుకోవడం పొరపాటు. చంద్రబాబు గారి కందుకూరు సభ, నిన్నటి ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ సభలో జరిగింది తొక్కిసలాట కాదు. వైసీపీ సర్కారు పాల్పడిన మారణహోమం. కోడికత్తి, పింక్ డైమండ్, బాబాయ్ గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన ప్రశాంత్ కిశోర్ శకుని వ్యూహాల్లోంచి వచ్చిన మరో క్రూర వ్యూహం. వారు చనిపోలేదు వైసీపీ వాళ్లే చంపేశారు”. అని ఆరోపించారు నారా లోకేష్.
రిలయన్స్ వాళ్లు తన తండ్రిని చంపేశారంటూ నాడు ప్రజలను రెచ్చగొట్టి రిలయన్స్ అవుట్ లెట్స్ కి నిప్పంటించాడు,నేడు వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన మేకవన్నె పులి జగన్ రెడ్డి.ఓట్ల కోసం సొంత బాబాయ్ పై గొడ్డలి వేటేసిన క్రూరుడు జనాన్ని కనికరించి వదిలేస్తాడు అనుకోవడం పొరపాటు.(1/3)
— Lokesh Nara (@naralokesh) January 2, 2023