హాట్ టాపిక్: అచ్చెన్న పదవికి అడ్డు తగులుతున్న లోకేష్!

మనం బలవంతులము అని తెలియాలంటే బలహీనులను పక్కనేసుకుని తిరగడం కాదు.. బలవంతులతో పోటీకి దిగడం! ఈ విషయంలో చినబాబు లోకేష్ మొదటి సిద్దాంతాన్నే ఫాలో అవుతున్నారనే కామెంట్లు రాజకీయవర్గాల్లో, మరి ముఖ్యంగా టీడీపీలో హాట్ టాపిక్ అయ్యి కూర్చున్నాయి! దానికి కారణం అయ్యింది…. అచ్చెన్నాయుడు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా జరుగుతుందని, అందుకోసం అచ్చెన్నాయుడిని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. వారి అనుకూల మీడియా కూడా ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేసిందింది. ఇంతలోనే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో కానీ… రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో బాబు పునరాలోచనలో పడ్డారని తెలిసింది. దీనికి ప్రధాన కారణం చినబాబు అభ్యంతరం చెప్పడమే కారణమని తెలుస్తోంది!

అవును… అచ్చెన్నాయుడి ఎంపికపై లోకేష్ అభ్యంతరం చెబుతున్నాడంట! వినడానికి కాస్త షాకింగ్ గా అనిపించినా ఇది పూర్తి వాస్తవం అనేది టీడీపీ సర్కిల్ లో బలంగా వినిపిస్తున్న మాట!అచ్చెన్నాయుడు బలమైన నేతే కాదు.. బలమైన నోరున్న నేత.. దూకుడున్న నేత! దీనికి తోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు కూడా తోడైతే ఇక సొంతంగా దూసుకుపోయే పరిస్థితి! దీంతో చినబాబుకి బెంగట్టుకుందట!

తన కంటే రాష్ట్ర అధ్యక్షుడు ధీటుగా, దూకుడుగా ముందుకు వెళితే తన భవిష్యత్ కు ఇబ్బంది అని లోకేష్ భావిస్తున్నారని అంటున్నారు తమ్ముళ్లు! దానికి తోడు అచ్చెన్నాయుడు నియామకంపై కళా వెంకట్రావు కూడా లోకేష్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారని.. అచ్చెన్న వల్ల తమరు సెకండ్ కాదు థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోతారని ఎక్కేశారని.. అందుకే అచ్చెన్నాయుడి పేరును చినబాబు వ్యతిరేకించినట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది! “ఆఖరికి చినబాబు అంతకు తెగించారన్నమాట”… అచ్చెన్న అభిమానుల మాట!!

-CH Raja