సైకో స‌ర్కారును ఇంటికి సాగ‌నంపుదాం – నారా లోకేష్

-

సైకో స‌ర్కారును ఇంటికి సాగ‌నంపుదామన్నారు నారా లోకేష్. సైకో జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో అక్ష‌రాలు నేర్పే గురువులూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం చాలా దారుణం అని ఆగ్రహించారు. వారం రోజుల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్ గ‌ద్దెనెక్కి 200 వారాలు దాటిపోయినా సీపీఎస్ ర‌ద్దు చేయ‌లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి ఇచ్చిన మాట త‌ప్పాడు, మడ‌మ తిప్పాడన్నారు. శాంతియుతంగా సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్య‌మించిన ఉపాధ్యాయులు అలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Letter from Rashtrapati Bhavan to Nara Lokesh
nara lokesh

జీపీఎస్ పేరుతో మ‌రో వంచ‌న‌కి తెర‌లేపాడు. జీతాలు ఏ నెలా స‌కాలంలో ఇవ్వ‌డంలేదు. ఇవి చాల‌వ‌న్న‌ట్లు బోధ‌నేత‌ర ప‌నులు, త‌నిఖీల పేరుతో టీచ‌ర్ల‌ను వేధిస్తున్నాడు. ఒక సీఎం ఈ స్థాయిలో మోసం చేయ‌డం త‌ట్టుకోలేక అనంత‌పురం జిల్లా పెన్న అహోబిళంలో ప్రభుత్వ టీచర్ మల్లేశ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ‌టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మ‌ల్లేశ్ గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

జ‌నాన్ని మోసం చేసిన జ‌గ‌న్ మోస‌పు రెడ్డి హాయిగా ఊరికొక‌ ప్యాలెస్ క‌ట్టుకుని, దోచి దాచుకున్న కోట్ల నోట్ల క‌ట్టల‌తో ఎంజాయ్ చేస్తుంటే.. మోస‌పోయిన మీరెందుకు చావాలి మాస్టారు. మీరంతా క‌లిసి ద‌గాకోరు జ‌గ‌న్ పై పోరాడండి. అండ‌గా మేముంటాం. సైకో జ‌గ‌న్ మాయ మాట‌లు, హామీల‌తో మోస‌పోయిన క‌ర్ష‌క‌,కార్మిక‌, ఉద్యోగులంతా క‌లిసి ఉద్య‌మిద్దాం..సైకో స‌ర్కారుని ఇంటికి సాగ‌నంపుదామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news