బ్రేకింగ్ : ఏకాంతంగానే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

-

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై ఇన్నాళ్ళూ డైలమాలో ఉన్న టీటీడీ ఎట్టకేలకి ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినప్పటికీ కరోనా పరిస్థితుల దృష్ట్యా వెన్నకి టీటీడీ వెనక్కి తగ్గింది. వార్షిక బ్రహ్మోత్సవాల లాగానే నవరాత్రి ఉత్సవాలను కూడా ఆలయంలోనే టీటీడీ నిర్వహించనుంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా చిత్తూరు జిల్లాలో మాత్రం కరోన వ్యాప్తి తగ్గడం లేదు.

అయితే గతంలో వినాయక చవితి, ఓనం పండగల అనంతరం మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు పెరిగినట్టు గుర్తించారు. దీంతో బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలను తిలకించేందుకు పరిమితికి మించి భక్తులు గ్యాలరీలలోకి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం వుందని టీటీడీ, జిల్లా యంత్రాంగం నిర్దారణకు వచ్చారు. నిన్న అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news