వన్ మోర్: జగన్ చేతిలో పచ్చనేతల కల్పతరువు రిపోర్ట్!

-

అవినీతి చేయడానికే కొత్త కొత్త ఆలోచనలతో పథకాలు రూపొందించారా లేక రూపొందించిన ప్రతి పథకంలోనూ అవినీతి మార్గాన్ని వెతుక్కున్నారా? గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరగని చోటు లేదు, అవినీతి జరగని పథకం లేదు అన్నట్లుగా రోజుకో రిపోర్ట్ జగన్ టేబుల్ పైకి చేరుతుంది! తాజాగా మరో రిపోర్ట్ చేరింది!

ఆ రిపోర్టుల గురించి విన్నవారికి, ఆ రిపోర్టులను చదివివారికి మాత్రం… ఇలా కూడా తినేశారా.. అలాకూడా తినేస్తారా.. జనం సొమ్మంటే నాటి ప్రభుత్వానికి అంత చులకనా.. నాటి నేతలకు అంత తీపా అన్న అనుమానాలు రాకమానవు! ఈ క్రమంలో పచ్చనేతలకు కల్పతరువుగా మారిందని విమర్శలొచ్చిన “నీరు – చెట్టు” పథకానికి సంబందించి జరిగిన అవినీతిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది.

ప్రస్తుతం ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో రూ. 427.24 కోట్లతో పనులు చేపట్టగా ఇందులో సగానికి పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి కేవలం విమర్శలు కాదు.. వాస్తవాలు అన్నట్లుగా ఒక నివేదికను సర్కార్కు సమర్పించింది విజిలెన్స్ డిపార్ట్మెంట్!

చెరువులో మట్టి తవ్వకాలకు క్యూబిక్‌ మీటర్ ‌కు రూ.29 చొప్పన చెల్లించాల్సిన బిల్లులకు క్యూబిక్‌ మీటర్ ‌కు రూ.82.80 చెల్లించారట నాటి ప్రభుత్వ పెద్దలు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణమాత్రమే అని తెలుస్తుంది. 29 కి 82 కి ఏమైనా సంబందం ఉందా… నాడు టీడీపీ నేతలు చెప్పిన మాటలూ చేసిన పనులకూ పొంతనలేనట్లుగానే!

అలా 29 ని 82 కి చేసిన అనంతరం.. ఆ చెరువుల్లో తవ్విన మట్టిని కోట్లాది రూపాయలకు అమ్మేసుకున్నారంట. అంతేనా… విక్రయించిన మట్టిని నీరు – చెట్టు పనుల కింద తవ్వినట్టు బిల్లులు చేసుకున్నారట. ఇదే క్రమంలో తవ్విన మట్టి శ్మశానం, ఇళ్లు వంటి అవసరాలకు కాకుండా ప్రైవేటు రోడ్లకు వేసుకున్నారట.. అది కూడా ప్రభుత్వం ఖర్చుతో!

నిబంధనల ప్రకారం 50 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ ఆ నిబంధన ఒకటి ఉందన్న ఆలోచనే లేకుండా పనులు చేశారంట. ఇవి విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికలో మచ్చుకు కొన్ని మాత్రమే!! ఇలాంటివి ఎన్నో.. ఎన్నెన్నో.. మరెన్నో.. ఇంకెన్నో… వెలుగులోకి రాబోతున్నాయని అంటున్నారు వైకాపా నేతలు!!

Read more RELATED
Recommended to you

Latest news