ఏపీలో ఎన్నికల సందడి మొదలు కాబోతోంది.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ మేరకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది.. ఎట్టిపరిస్థితుల్లోనూ తానుండగానే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీరాలని నిమ్మగడ్డ ఉవ్విళ్లూరుతున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రచారంపై నిమంగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చేశారు!
అవును… ఏపీలో పంచాయితీ – మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం నిజమనుకొని గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు అప్పుడే ప్రచారం కోసం అంతా సెట్ చేసుకుంటున్నారు కూడా! అయితే ఈ విషయాలపైనా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న షెడ్యూల్ పైనా తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్… ఆ షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని.. ఎన్నికల కమిషనర్ గా తాను ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోనే ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ లా వ్యవహారం మారిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ప్రకటించిన స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ కరోనా కారణం చూపిస్తూ వాయిదా వేయడం.. దీనిపై సీరియస్ అయిన జగన్ సర్కార్ నిమ్మగడ్డను తొలగించడం.. ఈ వ్యవహారం సుప్రీం కోర్టువరకూ వెళ్లడం.. ఫలితంగా ఇటీవలే నిమ్మగడ్డ మళ్లీ పునర్ నియామకం అవ్వడం తెలిసిందే!!
-CH Raja