ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేదో చర్చనీయ్మ్షంగా మారింది. ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా సరే ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ రోజు మళ్ళీ హై కోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలో ఇటీవల హై కోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారు అని ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పామనిమ్ హై కోర్టు ఆదేశాల మేరకు గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన కోర్టుకు పేర్కొనే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల పై కమిషన్ బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని, అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది అని అందుకే దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు వెళ్లాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే చూడాలి హైకోర్టు ఈ అంశం మీద ఎలా స్పందిస్తుందో ?